SEBI
SEBI | అదానీకి సెబీ క్లీన్ చిట్.. హిండెన్ బర్గ్ ఆరోపణలకు ఆధారల్లేవని స్పష్టీకరణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SEBI | అదానీ గ్రూప్ సంస్థలకు (Adani Group companies) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్​ బర్గ్​ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

అదానీ గ్రూప్ ఛైర్ పర్సన్ గౌతమీ అదానీతో (Gautami Adani) ఆయన సంస్థలకు క్లీన్ చిట్ ఇస్తూ.. సదరు వ్యక్తులు, సంస్థలపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తేల్చి చెప్పింది. అదానీ సంస్థల్లో (Adani companies) అనేక అవకతవకలు జరిగాయని, అధిక వాల్యుయేషన్ చూపెడుతూ పెట్టుదారులను మోసం చేస్తున్నారని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నాలుగేళ్ల క్రితం తీవ్ర ఆరోపణలు చేసింది. హెండెన్ బర్గ్ ఆరోపణలు (Hindenburg’s allegations) దేశంలో సంచలనం సృష్టించగా, అదానీ సంస్థల షేర్లు ఘోరంగా పడిపోయాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, విచారణకు ఆదేశించింది. మరోవైపు సెబీ దర్యాప్తు చేపట్టింది.

SEBI | ఆరోపణలకు ఆధారాల్లేవు..

అదానీ సంస్థలపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సెబీ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిన సెబీ (Sebi).. హిండెన్​ బర్గ్​ ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్​పై ఎటువంటి జరిమానా విధించడం లేదని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది. SCNలో నోటీసులపై చేసిన ఆరోపణలు నిరూపితం కాలేదని సెబీ తెలిపింది. “పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే నోటీసులపై ఏదైనా చర్యలు తీసుకునే ప్రశ్నే తలెత్తదు. అందువల్ల జరిమానాపై ఎటువంటి చర్చ అవసరం లేదు” అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

SEBI | వడ్డీతో సహా రుణాలు చెల్లించారు..

అదానీ సంస్థలు వడ్డీతో సహా రుణాలను తిరిగి చెల్లించారని, నిధులను దుర్వినియోగం చేయలేదని, అందువల్ల ఎటువంటి మోసం లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతి జరుగలేదని సెబీ స్పష్టం చేసింది.. అదానీ పోర్ట్స్ అడికార్ప్ ఎంటర్​ ప్రైజెస్​కు నిధులను బదిలీ చేసిందని, ఆ నిధులను అదానీ పవర్​కు రుణాలుగా అందించిందని సెబీ తన దర్యాప్తులో గుర్తించిందని తెలిపింది. అయితే, అదానీ పవర్ అడికార్ప్ ఎంటర్​ ప్రైజెస్​ఖు (Adicorp Enterprises) అదానీ పోర్ట్స్ వడ్డీతో తిరిగి చెల్లించింది. అదేవిధంగా, దర్యాప్తు చేస్తున్న మరో కేసులో అదానీ పోర్ట్స్ మైల్స్టోన్ ట్రేడ్లింగ్​లకు నిధులను రుణంగా బదిలీ చేసింది, ఆ తరువాత వాటిని అదానీ పవర్​కు ట్రాన్స్ ఫర్ చేసింది. కానీ అదానీ పవర్ మైల్స్టోన్ ట్రేడ్లింగ్​లకు రుణాన్ని తిరిగి చెల్లించింది, ఆ తరువాత అదానీ పోర్ట్స్​కు వడ్డీలతో తిరిగి చెల్లించిందని సెబీ పేర్కొంది.