అక్షరటుడే, కామారెడ్డి: Defense Liquor | మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో (Arepalli village) ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన డిఫెన్స్ లిక్కర్‌ను (Defense Liquor) ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలోని హన్మాండ్లు అనే వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ అధికారుల బృందం సోదాలు చేపట్టింది.
ఈ సోదాల్లో ఓ కార్యక్రమం నిర్వహణ కోసం తీసుకొచ్చిన 55 సీసాల మిలటరీ లిక్కర్ (సుమారు 41.25 లీటర్లు) లభించింది. దాంతో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డిఫెన్స్ లిక్కర్ ఇంట్లో కలిగి ఉండడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్సైలు విక్రమ్, శ్రీనివాస్ రావు, సిబ్బంది పాషా, మైసరాజు, దేవా కుమార్ పాల్గొన్నారు.