Hyderabad Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. నగరవాసుల తిప్పలు
Hyderabad Rains | హైదరాబాద్​లో భారీ వర్షం.. నగరవాసుల తిప్పలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Rains | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది.

నగరంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా విషయం తెలిసిందే. గురువారం ఉదయం వరకు కూడా పలు కాలనీలను వరద వీడలేదు. గురువారం సాయంత్రం మళ్లీ వాన దంచికొట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నగరంలోని బహదూర్‌పురాలో 7.6 సెం.మీ, జూపార్క్ దగ్గర 6.9, రూప్‌లాల్‌ బజార్‌లో 6.9, నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచింది.

Hyderabad Rains | ట్రాఫిక్​ జామ్

భారీ వర్షంతో నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ (Traffic)​ స్తంభించింది. కార్యాయాల నుంచే ప్రజలు ఇళ్లకు వెళ్లే సమయంలో వాన పడింది. దీంతో గంటల కొద్ది ట్రాఫిక్​లో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్‌ వరకు.. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు.. మెహదీపట్నం నుంచి రాయదుర్గం వరకు ట్రాఫిక్​ నిలిచిపోయింది. సచివాలయం -ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్​ అయింది. చంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌లో భారీగా వాహనాలు బారులు తీరాయి. షేక్‌పేట, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలిలో నిలిచిపోయిన వాహనాలు..

Hyderabad Rains | రంగంలోకి ఎమర్జెన్సీ బృందాలు

వర్షాలతో రోడ్లపై నీరు నిలవడంతో హైడ్రా (Hydraa) మన్సూర్​ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం అయ్యాయి. జీహెచ్​ఎంసీ, హైడ్రా సిబ్బంది నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సైతం పరిస్థితిపై ఆరా తీశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల వాటర్‌ లాగింగ్‌ ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్​ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైతం వర్షం పడుతోంది.