Railway Forum
Railway Forum | కాగజ్​నగర్​ నుంచి తిరుపతికి రైలు నడపాలని వినతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Forum | సిర్పూర్ కాగజ్ నగర్​ (Sirpur Kagaz Nagar)లో వందే భారత్ (Vande Bharat) తొలి రోజు హాల్ట్ సందర్భంగా గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్​ ఎంపీ గోడెం నగేశ్​, సిర్పూర్​ ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం తరఫున ఠాకూర్ ప్రవీణ్ సింగ్, పూడరీ రవితేజ వారిని కలిసి వినతి పత్రం అందించారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి తిరుపతి వరకు నూతన రైలు నడపాలని కోరారు. బల్లార్షా నుంచి కాజీపేట ఎక్స్ ప్రెస్ రైలు చర్లపల్లి వరకు పొడిగించాలని, కాగజ్ నగర్ ప్రాంతంలో స్థిరపడిన బెంగాళీ ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి హౌరా వయా పెద్దపల్లి – మంచిర్యాల – సిర్పూర్ కాగజ్ నగర్ మార్గంలో రైలు నడపాలని కోరారు.

ముంబయి నుంచి బల్లార్షా వరకు నడుస్తున్న నందిగ్రామ్ 11001/02 ఎక్స్ ప్రెస్ రైలును కాజీపేట వరకు పొడిగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారు సానుకూలంగా స్పందించారని ఫోరం ప్రతినిధులు తెలిపారు.