Poshan Abhiyan
Poshan Abhiyan | పోషణ్​ అభియాన్​ను పక్కాగా అమలు చేయాలి.. కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

అక్షరటుడే, లింగంపేట: Poshak Abhiyan | పోషణ్​​ అభియాన్ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎంతో దోహదపడుతుందని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు.

లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రంలో (Anganwadi Center) నిర్వహిస్తున్న పోషణ్​ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్​వాడీ కేంద్రంలో స్టోర్​ రూం, వంటగదిని తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న చిన్నారులతో ముచ్చటించారు.

ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెరలు తగ్గించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే లబ్ధిని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులకు, కౌమార బాలికలకు తెలియజేయాలన్నారు. ప్రతిరోజు పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను వివరించాలన్నారు. తల్లిపాలు బిడ్డలకు ఎంత శ్రేష్టమో తెలియజేయాలని సూచించారు.

పాఠశాలలో కిచెన్ గార్డెన్​ను (Kitchen garden) పరిశీలించారు. అంగన్​వాడీకి అవసరమైన కూరగాయలను, ఆకుకూరలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీలకు సూచించారు. ఇంకా పెయింటింగ్ వేయని అంగన్​వాడీ కేంద్రాల్లో త్వరగా పెయింటింగ్​ పనులు పూర్తిచేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, సీడీపీవో, అడిషనల్ సీడీపీవో, ఎంపీడీవో, తహశీల్దార్​ వివిధ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.