Nova Hospital
Nova Hospital | విజయానికి ప్రతీక నోవా ఆస్పత్రి.. వైద్యుడు నవీన్​ మాలు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nova Hospital | జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆస్పత్రి విజయానికి ప్రతీకగా నిలుస్తోందని ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్​ నవీన్​ మాలు (Doctor Naveen Malu), దీపా మాలు పేర్కొన్నారు.

ఆస్పత్రిలో ఇప్పటివరకు 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా గురువారం ఆస్పత్రిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు నవీన్ ​మాలు మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధికంగా కొత్తగా రోబోటిక్ టెక్నాలజీతో (Robotic technology) 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

కీళ్ల మార్పిడి(Joint replacement), సాధారణ శస్త్ర చికిత్సలు (General surgeries), చికిత్స విభాగం, స్త్రీ వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో సేవలు అందించడంలో తమ వైద్యుల పాత్ర చాలా గొప్పదన్నారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి చికిత్స పొందిన బాధితులు రావడం.. ఆటపాటలతో అందర్నీ అలరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందితోనే ఇది సాధ్యమైందని అన్నారు. జిల్లా ప్రజలు హైదరాబాద్​కు వెళ్లకుండా స్ధానికంగా నోవా ఆస్పత్రిలోనే తక్కువ ఖర్చుతో ఆపరేషన్ సేవలు అందిస్తున్నామని అన్నారు. పేద ప్రజలను గుర్తుపెట్టుకుని వారి బడ్జెట్ తగ్గట్టుగా అండగా నిలబడడమే నోవా ఆస్పత్రి లక్ష్యమన్నారు. హైదరాబాద్ కంటే నోవా ఆస్పత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.