Minister Ponguleti
Minister Ponguleti | మీ నాన్నతోనే కాలేదు.. నువ్వు బచ్చాగాడివి.. కేటీఆర్​కు పొంగులేటి కౌంటర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్​ బచ్చా అని వ్యాఖ్యానించారు.

కేటీఆర్​ ఇటీవల మాట్లాడుతూ.. పొంగులేటి(Minister Ponguleti)పై విమర్శలు చేశారు. ఆయన అనుకోకుండా గెలిచారని వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి స్పందించారు. పాలేరులో తన గెలుపును ఆపడానికి కేసీఆర్(KCR)​ మూడు సార్లు ముక్కు నేలకు రాసిన.. ఆయన వల్లే కాలేదన్నారు. ‘‘నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి” అని కేటీఆర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల వరకు అసలు కేటీఆర్​ ఇండియాలో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. సంచి సర్దుకుని అమెరికాకు వెళ్లిపోతారని చెప్పారు.

Minister Ponguleti | రెండు సార్లు బుద్ధి చెప్పారు

ప్రజల తీర్పును గౌరవించాలని పొంగులేటి హితవు పలికారు. అహంకారంతో మాట్లాడినందుకు ప్రజలు రెండు సార్లు బీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పారన్నారు. మూడో సారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. “నువ్వు నా పై పోటీ చేస్తావా.. లేదంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి కాంగ్రెస్​ గెలిపిస్తాదా”అని పొంగులేటి అన్నారు.

Minister Ponguleti | బీఆర్​ఎస్​ ఏమవుతుందో..

దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party) సత్తా చూపించాలని మంత్రి పొంగులేటి సవాల్​ చేశారు. ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏమవుతుందో చూసుకోవాలన్నారు. ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్‌లో మీ పార్టీ బలాన్ని చూపించండి అని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు(Jubilee Hills By Elcetions) త్వరలో జరగనున్నాయి. అక్కడ గెలుపు కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.