అక్షరటుడే, ఇందూరు: Yashoda Hospital | బ్లడ్ క్యాన్సర్ (Blood cancer) ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ (Hi-tech City) యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యుడు గణేష్ జైషెత్వార్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం బ్లడ్ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బ్లడ్ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఈ వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.
Yashoda Hospital | తక్కువ ఖర్చుతో వైద్యం..
బ్లడ్ క్యాన్సర్‌కు అభివృద్ధి చెందిన దేశాల్లో రూ. 10కోట్లకు పైగా ఖర్చు అవుతుందని.. భారతదేశంలో మాత్రం రూ.20లక్షలతో వైద్యం పూర్తవుతుందని వైద్యుడు గణేష్ జైషెత్వార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సంప్రదించగా 2014 నుంచి 2017 వరకు చికిత్స అందజేశామన్నారు.
ప్రస్తుతం బాలుడు చదువులో, క్రీడల్లో మెరుగ్గా రాణిస్తున్నాడని చెప్పారు. అలాగే సోమేశ్వర్ అనే బాలుడు 13ఏళ్ల వయస్సులో ఇదే వ్యాధితో బాధపడుతుంటే..అతడికి సైతం అద్భుత చికిత్సతో నాయం చేశామన్నారు.
వర్ని మండలానికి చెందిన రామారావు బ్లడ్ క్యాన్సర్‌తో యశోద ఆస్పత్రికి రాగా.. ఆయనకు సైతం మెరుగైన చికిత్స అందించామని ఆయన తెలిపారు. 2025లో బ్లడ్ క్యాన్సర్‌కు ఖచ్చితమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని వారు స్పష్టం చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని ప్రతి క్యాన్సర్‌కు చికిత్సలు తప్పకుండా ఉన్నాయని ఆయన తెలిపారు.