
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Credit Card Users | క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చేస్తున్నవారికి ఫిన్‌టెక్ సంస్థలు చేదువార్త చెప్పాయి. ఇకపై రెంట్ పేమెంట్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. క్రెడ్(Cred), ఫోన్‌పే(PhonePe), పేటీఎం వంటి సంస్థలు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
చాలా మంది క్రెడిట్‌కార్డ్ వినియోగదారులు(Credit Card Users) రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా నగదును బదిలీ చేసుకుని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. అయితే ఈ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ(RBI) చర్యలు చేపట్టింది. పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్‌వేలకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. ఆయా సంస్థలతో నేరుగా సంబంధం లేని సంస్థలకు లావాదేవీలు ప్రాసెస్ చేయరాదని ఆదేశించింది. కేవైసీ పూర్తి చేసిన మర్చంట్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని పేర్కొంది. అయితే రెంట్ పేమెంట్ విషయంలో యజమానులు రిజస్టర్డ్ వ్యాపారులు కాకపోవడంతో ఫిన్‌టెక్ కంపెనీలు(Fintech Companies) ఈ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
దీంతో ఇన్నాళ్లు ఆయా సంస్థలలోని రెంట్ పేమెంట్ ఆప్షన్‌ను వినియోగించుకుంటూ క్రెడిట్ కార్డులలోని నగదును బదిలీ చేసుకుంటున్నవారికి ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారనుంది. కాగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా నగదును బదిలీ చేసుకుంటున్న విషయాన్ని ఇప్పటికే బ్యాంకులు గుర్తించాయి. అందుకే అవి రెంట్ పేమెంట్(Rent Payment)పై కనీసం ఒక శాతం రుసుమును వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ పేమెంట్లపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వడం లేదు. అదనపు చార్జీలను భరిస్తూ అయినా తమ అవసరాలకోసం రెంట్ పేమెంట్ ఆప్షన్‌ను వినియోగించుకుంటున్న క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కు ఆర్బీఐ ఆదేశాలు, ఫిన్‌టెక్ కంపెనీల నిర్ణయంతో పెద్ద చిక్కే వచ్చి పడిరది.