అక్షరటుడే, కామారెడ్డి: Producer Dil Raju | సినీరంగం వైపు అడుగులు వేయాలనుకుంటున్న విద్యార్థులకు ఏఐ (AI), వీఎఫ్ఎక్స్లో (VFX) ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని ప్రముఖ సినీ నిర్మాత లార్వెన్ (LARVEN) ఫౌండర్ దిల్ రాజు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో (Sandipani Degree College) గురువారం నిర్వహించిన స్కిల్ప్లస్ (SkillPlus) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ, ధృడ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఉత్సాహం ఉన్న విద్యార్థులకు నిజామాబాద్ పరిధిలోనే ఏఐ, వీఎఫ్ఎక్స్లో ప్రత్యేక శిక్షణనిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం డిగ్రీతో పాటు వివిధ మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలను పొందిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో దిల్రాజు సతీమణి LARVEN co-founder వైగారెడ్డి (LARVEN co-founder Vaigareddy), వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు రక్షిత్ రెడ్డి, మనీష్, సాయి కిరణ్, దేశ పాండే ఫౌండేషన్ ప్రతినిధులు శేఖర్, శ్రీకాంత్, సాందీపని కళాశాల డైరెక్టర్ హరిస్మరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ సాయిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.