అక్షరటుడే, డిచ్పల్లి: Jakranpalli | పరీక్ష రాసి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందిన ఘటన జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ (Argul) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు బానోత్ మంజుల, బానోత్ అశ్విని హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసేందుకు గ్రామానికి చెందిన హంసరాజుతో వెళ్లారు. అనంతరం కారులో ముగ్గురు హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారులోని మైత్రి ఫంక్షన్ హాల్ (Maitri Function Hall)వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువతులు మంజుల, అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ హంసరాజును 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌కు తరలించారు.
Beaking News