Haritha Haram
Haritha Haram | హరితహారంలో వెదురును ప్రోత్సహించాలి

అక్షరటుడే ఇందూరు: Haritha Haram | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో (Haritha Haram program) వెదురును ప్రోత్సహించాలని, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

ప్రపంచ వెదురు దినోత్సవాన్ని (World Bamboo Day) పురస్కరించుకొని వినాయక్ నగర్​లోని విగ్రహాల పార్కులో కేతయ్య స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో మహేంద్రులకు ఐదు ఎకరాల భూమి కేటాయించి అందులో వెదురు పంటను పండించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నాణ్యమైన వెదురు బొంగు దొరకక మహేంద్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం (Khammam) నుంచి వెదురును తేవడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడుతున్నాయని తెలిపారు. మహేంద్ర చేతివృత్తిని బతికించాలంటే ప్రభుత్వాలు ప్రతి నియోజకవర్గంలో వెదురు మొక్కలను నాటాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు దేవేందర్, శంకర్, విజయ్, అజయ్, చంద్రకాంత్, శ్రీలత, జయ, రుక్మిణి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.