MLA Dhanpal
MLA Dhanpal | మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రపంచ దేశాలు

అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | ప్రపంచ దేశాలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సేవాపక్షంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం దేవి రోడ్డు చౌరస్తా నుంచి పాత గంజ్​ కమాన్ వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని (Swachh Bharat Program) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ప్రధానంగా ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాల్లో ప్రపంచ దేశాలలో విశ్వ గురువుగా నిలబెట్టాడన్నారు. ప్రధాని మోదీ జన్మదిన (PM Modi Birthday) వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా కూడా అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పాత గంజ్​ ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి చెత్త నిల్వ ఉండడంతో మున్సిపల్ సిబ్బందిపై (Municipal Staff) ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

MLA Dhanpal | మహిళా మోర్చా ఆధ్వర్యంలో..

బీజేపీ మహిళా మోర్చా (BJP Women Morcha) ఆధ్వర్యంలో బుధవారం అక్షరధామ్​ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.