108 Ambulance
108 Ambulance​ | అత్యవసర పరిస్థితుల్లో 108లో డెలివరీ

అక్షరటుడే, బోధన్​ : 108 Ambulance​ | అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది అంబులెన్స్​లో గర్భిణికి డెలివరీ(Delivery) నిర్వహించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బోధన్​ మండల కల్దుర్కి గ్రామానికి చెందిన లావణ్య అనే గర్భిణి పురిటినొప్పులు ఎక్కువకాగా.. 108కు సమాచారం ఇచ్చారు.తక్షణమే స్పందించిన సిబ్బంది ఆమెను తీసుకుని బోధన్​ ప్రభుత్వాస్పత్రి(Bodhan Government Hospital)కి బయలుదేరారు. మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు ఎక్కువకాగా.. అంబులెన్స్​లో డెలివరీ జరిగింది. పైలెట్​ వెంకటి, ఈఎంటీ శివ దినేష్​, ఆశావర్కర్(Asha Worker)​ నవనీత సాయంతో డెలివరీ నిర్వహించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని.. తదుపరి వైద్యసేవల నిమిత్తం వారిని బోధన్​ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్​ సిబ్బంది(Ambulance Staff) పేర్కొన్నారు.