Journalists protest
Journalists protest | జర్నలిస్టుపై దాడికి నిరసనగా ధర్నా

అక్షరటుడే కమ్మరపల్లి: Journalists protest | మోర్తాడ్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గం (Balkonda Constituency) ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (Print, electronic media) జర్నలిస్టులు గురువారం ధర్నా నిర్వహించారు.

ఇటీవల ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ (Talla rampur) గ్రామంలో గౌడ కులస్థులకు, వీడీసీ సభ్యులకు గొడవ జరిగింది. అయితే న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్ట్ అశోక్​పై వీడీసీ సభ్యులు దాడి చేశారు. దీంతో సదరు జర్నలిస్టు​ వీడీసీ సభ్యులపై సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేయగా.. విచారించి చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.

అయితే విలేకరిపై దాడిని ఖండిస్తూ.. ఇతర జర్నలిస్టు సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి అనేది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బాల్కొండ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.