అక్షరటుడే, బాల్కొండ: CMRF Checks | అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులు వచ్చేలా కృషి చేస్తున్నారు.
CMRF Checks | బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో..
బాల్కొండ (Balkonda) మండలం కిసాన్ నగర్లో (kisan Nagar) గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చెక్కులను మంజూరు చేయించారు.
ముగ్గురు లబ్ధిదారులకు రూ.45వేల విలువైన చెక్కులను మంజూరు చేయించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, అశోక్, ప్రసాద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
CMRF Checks | లింగంపేటలో..
అక్షరటుడే,లింగంపేట: మండల కేంద్రానికి చెందిన గజవాడ మహేష్‌కు గురువారం సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతుందని అన్నారు.
రాష్ట్రంలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు (MLA Madanmohan Rao) సహకారంతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్ గౌడ్, ప్రసాద్, డివిటి అశోక్, కౌడ రవి, భాస్కర్ గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.