Kurnapally village
Kurnapally village | పట్టపగలే దొంగల హల్​చల్​.. బంగారంతో పాటు నగదు అపహరణ

అక్షరటుడే, బోధన్: Kurnapally village | ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో (Kurnapally village) పట్టపగలే దొంగల హల్​చల్​ చేశారు. ఓ ఇంట్లో చొరబడి బంగారంతో పాటు నగదు (stole gold and cash) ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. కుర్నపల్లికి చెందిన తులసిగారి నరేందర్​ రెడ్డి అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం బయటకు వెళ్లారు.

దీనిని గమనించిన దుంగడులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు మూడున్నర తులాల బంగారంతో పాటు ముప్పై వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వాళ్లు ఇంటి వచ్చి చూసే చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas)​, బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు (Bodhan Rural CI Vijay Babu), ఎస్సై రమ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్​తో విచారణ చేపట్టారు. క్లూస్ టీం పిలిపించి ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.