అక్షరటుడే, బాన్సువాడ: Chanduru | పరువు పోయిందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చందూరులో Chanduru చోటు చేసుకుంది. వర్ని varni si mahesh ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి(46) పొలంలో పంట వేసి పురుగు మందుల కోసం ఓ దుకాణంలో అప్పు చేశాడు.
అప్పు తీర్చకపోవడంతో దుకాణ యజమాని కోర్టు courtను ఆశ్రయించాడు. దుకాణ యజమానికి అప్పు చెల్లించాలని, పొలం ఎవరికి అమ్మకూడదని కోర్టు ఆదేశాలతో చాటింపు వేయించారు. పరువు పోయిందని మనస్తాపం చెందిన రైతు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.