Nizamabad City
Nizamabad City | రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క : Nizamabad City | రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

నగరంలోని అర్సపల్లి (Arsapalli) భగత్​సింగ్​ కాలనీకి చెందిన ఎనగందుల మహేశ్​ మున్సిపల్​ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆయన కొంతకాలం నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో తాగుడు మానుకోవాలని ఆయనను భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి నిజామాబాద్ – జానకంపేట్ రైల్వే స్టేషన్ల (Nizamabad-Janakampet railway stations) మధ్య రైలు కింద పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.