
అక్షరటుడే, వెబ్డెస్క్ : Stree Shakti Scheme | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంకి మహిళల నుంచి తొలి నెలలోనే విశేష స్పందన లభించింది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం కింద, సెప్టెంబర్ 15 వరకు కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 78 లక్షల 45 వేల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు.
ఈ ప్రయాణ ఖర్చును భరించేందుకు ప్రభుత్వం రూ. 23.69 కోట్లు రాయితీగా చెల్లించింది.ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో 51.57 లక్షల మహిళలు ప్రయాణం రూ. 14.37 కోట్లు కాగా , కృష్ణా జిల్లాలో26.88 లక్షల మహిళలు ప్రయాణం రూ. 9.31 కోట్లుగా నమోదైంది. ఈ పథకంతో ఉద్యోగులు, విద్యార్థినులు, చిన్న వ్యాపారస్తులు, గృహిణులు ఎక్కువగా ప్రయాణిస్తున్నారంటే, దీని అవసరం ఎంత ఉందో తెలుస్తోంది.
Stree Shakti Scheme | బస్సుల్లో మహిళల రద్దీ
స్త్రీ శక్తి పథకం(Stree Shakti Scheme) ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే బస్సుల్లో మహిళల రద్దీ 80 శాతం వరకు పెరిగింది.సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇది పురుషుల ప్రయాణాన్ని ప్రభావితం చేస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.మహిళల అధిక రద్దీ వల్ల పురుషులు బస్సుల్లో నిల్చునే పరిస్థితి వస్తుంది. వృద్ధులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు కూడా ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారని వారి వాదన. ఈ నేపథ్యంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య కొన్ని కామెంట్స్ చేశారు.
బస్సుల్లో మహిళలకూ, పురుషులకూ సమంగా సీట్లు కేటాయించాలి. ఈ డిమాండ్ ఇప్పుడు సామాజిక వర్గాల్లో, పాలసీ నిర్ణేతల మధ్య చర్చనీయాంశంగా మారింది.ఇలా చూస్తే, స్త్రీ శక్తి పథకం అనేక వర్గాల్లో మార్పు తీసుకొస్తోంది. అయితే దీని ప్రభావాన్ని సమతుల్యంగా, సమగ్రంగా సమీక్షించి, పురుషులకు కూడా తగిన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.