అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Gold Statue | అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ భవనం(US Capitol Building) వద్ద డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో బిట్‌కాయిన్(Bitcoin)ను పట్టుకుని నిలబడి ఉన్నాడు. దీనిని వెండి, అల్యూమినియంతో రూపొందించి.. దానిపై బంగారం పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేటు కట్ నిర్ణయం ప్రకటించిన కాసేపటికే జరిగింది. విగ్రహం(Trump Gold Statue) ఏర్పాటుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Trump Gold Statue | నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
ఈ విగ్రహం ఏర్పాటుపై సోషల్ మీడియాలో మిశ్రమ ప్రతిస్పందనలు వచ్చాయి. ‘X’ ప్లాట్‌ఫామ్‌లో కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.
Trump Gold Statue | ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల కోత
అమెరికా ఫెడరల్ రిజర్వు 25 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్ ప్రభుత్వ విధానాలపై చర్చ జరిగేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం. ట్రంప్ బహిరంగంగా క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి మద్దతివ్వడంపై చర్చించుకునేలా చేస్తుందని తెలిపారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.