అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు (Tirumala Srivari Arjitha Seva tickets) సంబంధించిన డిసెంబర్ నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుంచి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
Tirumala | 22న ఆర్జిత సేవా టికెట్లు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
Tirumala | ప్రత్యేక దర్శనం కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను (Srivani Trust Darshan ticket quota) 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు సూచించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలన్నారు.