UAE vs PAK | యూఏఈపై పాక్ విజ‌యం.. కాక‌పోతే అంపైర్‌ని అలా కొట్టేశారేంటి..!
UAE vs PAK | యూఏఈపై పాక్ విజ‌యం.. కాక‌పోతే అంపైర్‌ని అలా కొట్టేశారేంటి..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE vs PAK | ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ Pakistan కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బుధవారం యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించి సూపర్-4కు అర్హత సాధించింది.

దీంతో ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో పాకిస్థాన్ మరోసారి తలపడనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది.

ఫకార్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో షాహిన్ షా అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.

ఆఖరి ఓవర్‌లో అఫ్రిది 18 పరుగులు రాబ‌ట్ట‌డంతో పాకిస్థాన్ ఫైటింగ్ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ (4/14) అద్భుతంగా రాణించగా, సిమ్రంజిత్ సింగ్ (3/26) మూడు వికెట్లు తీశాడు.

UAE vs PAK | మ‌ళ్లీ ట‌ఫ్ ఫైట్..

146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ UAE 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్), ధ్రువ్ పరాషర్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) మాత్రమే కొంత పోరాడారు.

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది (2/16), హ్యారీస్ రౌఫ్ (2/19), అబ్రర్ అహ్మద్ (2/13) రెండేసి వికెట్లు తీయగా, సైమ్ అయుబ్, సల్మాన్ అఘా చెరో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ తర్వాత పాకిస్థాన్ సూపర్-4లోకి అడుగుపెట్టింది. ఇక క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు ఆదివారం దుబాయ్‌లో జరగనుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో యూఏఈ ఇన్నింగ్స్ ఆడుతున్న స‌మ‌యంలో సైమ్ అయుబ్ వేసిన 6వ ఓవర్‌లో ఐదో బంతిని యూఏఈ బ్యాటర్ ధ్రువ్ పరాషర్ ఆడ‌కుండా వదిలేశాడు.

దీంతో బంతిని అందుకున్న కీపర్ మహమ్మద్ హ్యారీస్.. వెంటనే బౌలర్ సైమ్ అయుబ్‌ వైపు విసిరేయ‌గా, బంతి నేరుగా అంపైర్ రుచిర చెవికి బలంగా తాకింది.

దీంతో అంపైర్ రుచిరకు మహమ్మద్ హ్యారీ క్షమాపణలు చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. తన వల్లే గాయమైందని భావించి హ్యారీస్ Harris క్షమాపణలు చెప్పాడు. ఇక అంపైర్ రుచిర గాయ‌ప‌డ‌టంతో గజి సోహెల్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తించారు.