అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price | ఈ మధ్యకాలంలో బంగారం, వెండి ధరలు (Gold-Silver Price Today) కొత్త రికార్డులు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాయి.
ప్రత్యేకంగా బంగారం ధరలు మహిళలకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు కూడా ధరలు స్థిరంగా ఉండటం లేదు.
గంటల వ్యవధిలోనే ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 18 (గురువారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇది వినియోగదారులకు గణనీయమైన ఊరట కలిగించలేదు.
ధరలు తగ్గినప్పుడు పదుల్లో ఉంటే.. పెరిగినప్పుడు మాత్రం వందల్లో ఉంటోంది. ఈ అస్థిరత కొనుగోలు దారుల్లో సందిగ్ధతను పెంచుతోంది.
Today Gold Price | పెరుగుతున్న ధరలు..
ప్రస్తుత ధరలు (18 సెప్టెంబర్ 2025) చూస్తే.. 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) రూ. 1,11,850 (ఢిల్లీ) కాగా, 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు) – రూ. 1,02,540 (ఢిల్లీ)గా ట్రేడ్ అయింది. వెండి ధర (1 కేజీ)కి రూ. 1,31,900గా నమోదైంది.
ధరల పెరుగుదల వెనుక పలు అంతర్జాతీయ అంశాలు నెలకొని ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం, డాలర్ Dollar బలహీనత, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి.
ఈ అన్ని అంశాలు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్‌ను పెంచుతూ ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. దేశంలో వివిధ నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,11,700గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 గా నమోదైంది.
హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,11,700గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390గా నమోదైంది.
ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,11,700 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390గా నమోదైంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,12,030గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,690గా నమోదైంది.
ఇక బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,11,700 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390గా ట్రేడ్ అయింది.
రాను రాను వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు electric vehicles , సౌరశక్తి solar energy రంగం నుంచి వెండికి డిమాండ్ నిరంతరం పెరుగుతుండటం వల్ల ఈ లోహం ధరలకు రెక్కలు వస్తున్నాయి.