cloud burst | హైదరాబాద్​లో మేఘ విస్ఫోటనం.. తూఫ్రాన్​లో కుండపోత!
cloud burst | హైదరాబాద్​లో మేఘ విస్ఫోటనం.. తూఫ్రాన్​లో కుండపోత!

అక్షరటుడే, హైదరాబాద్: cloud burst | తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో మేఘ విస్ఫోటనం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచే భారీ వర్షం దంచికొడుతోంది.

గండిమైసమ్మ Gandimaisamma, ప్రగతినగర్​, కూకట్​పల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి Gachibowli, మణికొండ, నార్సింగి, అఫ్జల్‌గంజ్‌, లింగంపల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

cloud burst | తూఫ్రాన్​లో 12 సెం.మీ. వర్షపాతం..

ఇప్పటి వరకు మియాపూర్‌లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ., HCUలో 8.1 సెం.మీ, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

టోలిచౌకి దగ్గర ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. భారీ వర్షం వల్ల ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్‌బీ వరకు ట్రాఫిక్‌ జామ్ అయింది.

కుండపోత వల్ల మెట్రో స్టేషన్ల కింద వర్షపు నీరు భారీగా నిలిచింది. కుంభవృష్టి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

అటు మెదక్​లోనూ కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. నర్సాపూర్​, తూఫ్రాన్​, గుమ్మడిదల, అన్నారం, దుండిగల్​ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.

తూప్రాన్‌లో అయితే గంట వ్యవధిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి.