అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | దుర్గామాత (Durga Matha) మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుంచి డబ్బులను బలవంతంగా వసూలు చేయొద్దన్నారు. మండపాలను ట్రాఫిక్ (Traffic) ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలన్నారు.
CP Sai Chaitanya | జాగ్రత్తలు పాటించాలి
దుర్గామాత మండపాలను సందర్శించే మహిళలు, యువతులపై ఈవ్ టీజింగ్ జరుగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. సౌండ్ సిస్టం (Sound System) ఏర్పాటు విషయంలో ప్రజలు ఇబ్బందులు కల్గకుండా చూడాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేల ఏర్పాటుపై నిషేధం ఉందన్నారు.
CP Sai Chaitanya | మండపం దగ్గర ఉండాలి
దుర్గామాత మండలి వద్ద ఎల్లప్పుడు ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా నిర్వాహకులు ఉండాలని సీపీ ఆదేశించారు. పోలీసులు చెకింగ్‌కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడాలన్నారు. ప్రతి మండలి దగ్గర విధిగా పుస్తకం ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో సంతకం చేస్తారన్నారు. మండపాలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని, ఏమైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.