అక్షరటుడే, డిచ్పల్లి: Dichpally mandal | డిచ్పల్లి మండలం ఘన్పూర్కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ అందజేశారు. గ్రామానికి చెందిన 45 మంది యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ (Helping Hands) అనే సంస్థ ఏర్పాటు చేశారు.
వారు ప్రతి నెలా రూ.100 జమ చేస్తూ గ్రామంలో ఎవరు చనిపోయిన ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 కుటుంబాలకు ఆర్థిక సాయం (financial assistance) చేసినట్లు సభ్యులు తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ను అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ రమేశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.