అక్షరటుడే, ఆర్మూర్: Armoor RTC | విద్యార్థుల ‘యాత్ర దానం’ విహారయాత్రలకు (Excursion) కార్పొరేట్ సంస్థలు, ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya) కోరారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో సబ్‌కలెక్టర్ చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల విహారయాత్రలకు, నిరుపేదలు, వృద్ధులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో సహా అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రవికుమార్, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మెకానికల్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.