Bheemgal Mandal
Bheemgal Mandal |ఘనంగా విశ్వకర్మ యజ్ఞం

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | భీమ్‌గల్‌ శివారులోని మోతె రోడ్ లో గల విశ్వకర్మగుట్టపై (Vishwakarma gutta) బుధవారం భగవాన్ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. భీమ్‌గల్‌ మండల (Bheemgal Mandal) విశ్వకర్మ భగవాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా విశ్వకర్మ భగవాన్ చిత్రపటాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు.

గణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహ అష్టదిక్​ పాలక పూజ, కలశ పూజ, పంచామృత అభిషేకం, యజ్ఞం, తీర్థ ప్రసాదాల వితరణ తదితర కార్యక్రమాలను పురోహితులు సుంగరం శ్రీనివాసాచార్య, తాటికొండ రాజేశ్వర్, గంగాధర్, దర్శణాల శంకర్, రాగుల విఠలయ్య, గోపాలపూరం మల్లేషంచారి ఆధ్వర్యంలో జరిపించారు. కార్యక్రమంలో విశ్వకర్మ భగవాన్ ఆలయ కమిటీ  సభ్యులు, భీమ్‌గల్‌ పట్టణ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.