CP Sai Chaitanya
CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సాయమందించిన సీపీ..

అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడి ఓ వ్యక్తి గాయపడగా.. అటువైపుగా వెళ్తున్న సీపీ వెంటనే స్పందించారు. బాధితుడిని త్వరితగతిన వైద్యసాయం అందేలా చొరవ చూపారు.

వివరాల్లోకి వెళ్తే.. డిచ్​పల్లి పోలీస్​స్టేషన్ (Dichpally Police Station)​ పరిధిలోని నడిపల్లి (Nadipally) గ్రామ శివారులోని బైక్​పై వెళ్తున్న అశోక్​ గాబ్రి అదుపుతప్పి రోడ్డుపక్కన పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని అటువైపుగా వెళ్తున్న సీపీ సాయిచైతన్య చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని పరామర్శించారు. వెంటనే అంబులెన్స్​ను పిలిపించి అతడిని జీజీహెచ్​కు (GGH Nizamabad) తరలించే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.