Birkoor mandal
Birkoor mandal | మానవత్వం చాటిన మాజీ జెడ్పీటీసీ సతీష్

అక్షరటుడే, బాన్సువాడ: Birkoor mandal | బీర్కూరు మండలం బైరాపూర్ లో పలు బాధిత కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ సతీష్ (Former ZPTC Satish) ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన కొందరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు జీవనాధారం కోల్పోయారు.

దీంతో విషయం తెలుసుకున్న ఆయన మానవత్వం చాటుకున్నారు. బుధవారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. వారి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు15 కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం (financial assistance) అందజేశారు. దీంతో పలువురు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట గుమ్మ లక్ష్మణ్, శ్రీనివాస్, శ్రీశైలం గౌడ్, స్వరూప శ్రీనివాస్​, లింగమయ్య తదితరులు ఉన్నారు.