Neeraj Chopra
Neeraj Chopra | విజయానికి మరో అడుగు దూరంలో.. ఫైనల్స్ కు చేరిన నీరజ్ చోప్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Neeraj Chopra | భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Indian star athlete Neeraj Chopra) మరో సంచలన విజయానికి చేరువయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పురుషుల జావెలిన్ ఫైనల్​కు అర్హత సాధించాడు. బుధవారం టోక్యోలోని జపాన్ నేషనల్ స్టేడియంలో (Japan National Stadium) జరిగిన గ్రూప్ A క్వాలిఫయర్స్​లో అతను తన తొలి ప్రయత్నంలోనే 84.85 మీటర్లు జావెలిన్ విసిరాడు. తద్వారా గురువారం జరిగే ఫైనల్స్ లోకి అతను బెర్త్​ను సంపాదించాడు.

Neeraj Chopra | గట్టి పోటీ..

ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ 84.50 మీటర్లు కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన నీరజ్ సులువుగానే ఫైనల్ చేరాడు. అయితే, గోల్డ్ మెడల్ సాధించడానికి ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ (Germany Julian Weber) తన రెండో ప్రయత్నంలో 87.21 మీటర్ల ప్రయత్నంతో ఫైనల్ చేరుకున్నాడు. దీంతో అతడు నీరజ్ చోప్రాకు బలమైన ప్రత్యర్థిగా మారాడు. పోలిష్ డేవిడ్ వెగ్నర్ కూడా తన చివరి ప్రయత్నంలో 85.67 మీటర్లు జావెలిన్ విసిరి ఫైనల్​కు అర్హత సాధించారు. ఈ ప్రయత్నంలో అతను తన వ్యక్తిగత ఉత్తమ రికార్డును కూడా నెలకొల్పాడు.

Neeraj Chopra | తృటిలో దూరమై..

మరో భారతీయ అథ్లెట్ ఫైనల్స్ వెళ్లే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సచిన్ యాదవ్ (Sachin Yadav) రెండ ప్రయత్నంలో 83.67 మీటర్లు విసిరి తన సత్తా చాటాడు. కానీ ప్రత్యక్ష అర్హత సాధించడంలో విఫలమైన అతడు.. గ్రూప్ B క్వాలిఫయర్ బరిలో నిలబడ్డాడు.