Praja Palana Day
Praja Palana Day | జెండా వందనానికి ఆలస్యంగా వచ్చిన కలెక్టర్​.. తర్వాత ఏం జరిగిందంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Praja Palana Day | రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)​ సంస్థానం దేశంలో వీలినం అయిన రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా (Flag) ఆవిష్కరించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ముఖ్య అతిథులు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యాక్రమాలను కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే సిరిసిల్ల (Siricilla)లో మాత్రం కలెక్టర్​ ఆలస్యంగా హాజరయ్యారు. జెండా వందనం పూర్తయ్యాక ఆయన హడావుడిగా వచ్చి సెల్యూట్​ చేశారు.

Praja Palana Day | ప్రభుత్వ విప్​ ఆగ్రహం

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవానికి ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. ఆయన వచ్చి జెండా ఆవిష్కరించారు. అప్పటి వరకు కలెక్టర్​ సందీప్ ఝా (Collector Sandeep Jha) కార్యక్రమానికి హాజరు కాలేదు. జాతీయ గీతం పూర్తయ్యే సమయానికి ఆయన వచ్చి సెల్యూట్​ చేశారు. అయితే కలెక్టర్​ తీరుపై ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ (Government Whip Aadi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్​పై ఆయన సీఎంవో, సీఎస్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని, ప్రసంగం దాటవేశారని, అతిథిని స్వాగతించలేదని, వేదికపైకి ఆలస్యంగా వచ్చారని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆగస్టు 15న కూడా కలెక్టర్​ ఇలాగే వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అయితే కలెక్టర్​ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.