అక్షరటుడే, డోంగ్లి: Congress Party | కాంగ్రెస్ నుంచి సౌదాగర్ అరవింద్‌ను (Saudagar Arvind) సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇతర పార్టీలకు మద్దతు తెలిపినట్లు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ (suspend) చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం (former Jukkal MLA Saudagar Gangaram) సొంత సోదరుడి కుమారుడు సౌదాగర్ అరవింద్. 2023 నవంబర్లోనే అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సస్పెండ్ చేసినప్పటికీ.. తాను పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకుంటూ చెలామణి అవుతున్నట్లు తమవద్ద సమాచారం ఉన్నట్లు పార్టీ తెలిపింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశాడని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలో ఉన్నందున అరవింద్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తప్పుడు పైరవీలు చేసుకునే అవకాశముందనే ఉద్దేశంతో ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సౌదాగర్ అరవింద్ జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా చెలామణి అవున్నట్లు తమవద్ద సమాచారం ఉందని.. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులు లేవన్నారు.