అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Police jobs | బ్యాక్‌లాగ్ పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చుంచు కుమార్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గత సంవత్సరం నిర్వహించిన బ్యాక్‌లాగ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన 12 తప్పుల ప్రశ్నలపై తీవ్రస్థాయిలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చంచు కుమార్ సీఎంను కలిసి వారికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కుమార్ తెలిపారు. బ్యాక్‌లాగ్ పోలీస్ పరీక్షలో 12 ప్రశ్నలు తప్పులుగా వచ్చాయన్నారు. అభ్యర్థులకు గ్రేస్ మార్కులు మంజూరు చేస్తే 100 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.