అక్షరటుడే, వెబ్డెస్క్: Teenmar Mallanna | తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని (Telangana Rajyaadhikara Party) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవం.. అధికారం.. వాటా.. నినాదంతో పార్టీని స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) బంజారాహిల్స్‌లో గల తాజ్ కృష్ణ హోటల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాలను పరిచయం చేశారు.
Teenmar Mallanna | బీసీల ఆత్మగౌరవం కోసం..
బీసీల ఆత్మగౌరవం కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. ఈ పార్టీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారం అందించడమే మా లక్ష్యమని చెప్పారు. ఈ పార్టీ అన్ని వర్గాల మద్దతుతో ముందుకు సాగుతుందని, ముఖ్యంగా బీసీ సంఘాలను (BC communities) ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా.. కాంగ్రెస్లో ఉన్న సమయంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను పార్టీ ఆయనను స్పస్పెండ్ చేసింది.
Teenmar Mallanna | జెండా ఇదే..
పార్టీ జెండా రెండు రంగులతో పైభాగంలో ఎరుపు, కింది భాగంలో ఆకుపచ్చ రూపొందించారు. అలాగే జెండా మధ్యలో పిడికిలి బిగించిన చెయ్యి ఆత్మగౌరవానికి చిహ్నం. కార్మిక చక్రంతో పాటు వరి కంకులు ప్రజాస్వామ్యం, సామాజిక అభ్యున్నతికి సూచిక. ఇరువైపులా ఆలీవ్ ఆకులు చేర్చడం ద్వారా శాంతి, ఐక్యతను తెలియజేస్తున్నాయి. జెండా పైభాగంలో ‘ఆత్మగౌరవం.. అధికారం.. వాటా’ అనే నినాదాలు ఉన్నాయి.