అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పెరుగుతోంది. టికెట్ కోసం పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని బీఆర్ఎస్(BRS) గెలుచుకుంది. ఆ స్థానం నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ జూన్ 8న మృతి చెందారు. దీంతో త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. జూబ్లీహిల్స్‌లో ఎలాగైన గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ(BJP) ప్రయత్నిస్తున్నాయి. అయితే అధికార పార్టీలో ఆ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. గతంతో మాజీ ఎంపీ అజారుద్దీన్ ఈ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ ఆయనను ఎమ్మెల్సీ చేసింది.
Jubilee Hills | నాకే టికెట్ ఇవ్వాలి
యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్(Former MP Anjan Kumar Yadav) అన్నారు. యాదవ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీలో వెనుక ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు. పార్టీలో తనకంటే సీనియర్లు ఎవరూ లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
Jubilee Hills | ఎంతో అభివృద్ధి చేశా..
రెండు సార్లు సికింద్రాబాద్ ఎంపీగా పని చేసిన తాను జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. తమ సామాజిక వర్గానికి మంత్రి మండలిలో చోటు లభించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రి పదవి సైతం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) సైతం ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో జూబ్లీహిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.