అక్షరటుడే, ఆర్మూర్: Makloor | మాక్లూర్ మండలంలోని దుర్గానగర్ తండా (Durga nagar Thanda) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్వెద గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి తన కొడుకు, కోడలు చింటు, పూజను తీసుకొని బుధవారం ఉదయం ఒక బైక్‌పై నిజామాబాద్‌కు బయలు దేరారు.
మార్గమధ్యంలో దుర్గానగర్ వద్ద బైక్ అదుపుతప్పి ముగ్గురు కిందపడ్డారు. దీంతో మామ నారాయణకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. కోడలు పూజకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కొడుకు చింటు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.