అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్‌శాఖకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరయ్యేలా చూడాలని జిల్లా పోలీస్ శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
ప్రజాపాలన దినోత్సవం (Prajapalana Dinotsavam) సందర్భంగా జిల్లాకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి (Vem Narender Reddy) ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఆధ్వర్యంలో అసోసియేషన్ తరపున వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షకీల్ పాషా మాట్లాడుతూ.. ఎస్ఎల్ఎస్, అడిషనల్ ఎస్ఎల్ఎస్లు, జీపీఎఫ్‌లు, 2018 పీఆర్సీ బకాయిలు, 2023 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని కోరారు. 2018 పీఆర్సీ బకాయిలు మాత్రం రాష్ట్రంలో ప్రతి శాఖకు అందజేశారని పోలీస్‌శాఖకు మాత్రం రాలేదన్నారు.
ఈ ఏడాదిలో విద్యాసంవత్సరం ప్రారంభమై చాలా రోజులైనా ఫీజులు కట్టడంలో పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగువారికి పెద్ద పండుగైన దసరా ముందైనా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు.