అక్షరటుడే, వెబ్డెస్క్ : RBI Recruitment | ప్రభుత్వ ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గూడ్ న్యూస్ చెప్పింది. గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల(Grade-B Officer Posts) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్(Notifications) పూర్తి వివరాలు తెలుసుకుందామా..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 120
పోస్టుల వివరాలు..
ఆఫీసర్ గ్రేడ్ బీ (జనరల్ కేడర్) : 83.
ఆఫీసర్ గ్రేడ్ బీ (డీఈపీఆర్) : 17.
ఆఫీసర్ గ్రేడ్ బీ (డీఎస్‌ఐఎం) : 20.
వేతనం : ప్రారంభంలోనే బేసిక్ పే(Basic pay) రూ. 78,450 ఉంటుంది. వేతన శ్రేణి రూ. 78,450 రూ. 1,41,600 అందుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ మినహాయించి ఇతర అన్ని అలవెన్స్‌లు కలుపుకుని రూ. 1,50,374 వరకు అందుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్హత : ఏదైనా డిగ్రీ(Degree). ఆయా పోస్టులను బట్టి పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం అవసరం.
వయో పరిమితి : ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 21-30 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్ల వరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 30.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్(EWS) అభ్యర్థులకు రూ.850(జీఎస్టీ అదనం). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100(జీఎస్టీ అదనం).
ఎంపిక విధానం : ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్‌లైన్ ద్వారా ఫేజ్ 1, ఫేజ్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in లో సంప్రదించగలరు.