అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jogi Ramesh | బూడిద మాఫియాను ఎదుర్కొంటూ బుధవారం ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సిద్ధార్థ నగర్, మూలపాడు, ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బూడిద అక్రమ రవాణాను నిరసిస్తూ వైసీపీ నాయకులు(YCP Leaders) బూడిద డంప్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ధరాఅమలు చేసిన 144 సెక్షన్ ఆధారంగా వారిని అడ్డుకున్నారు. నలుగురికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టంచేశారు.ఈ నేపథ్యంలో జోగి రమేష్(Jogi Ramesh) ఇంటి వద్దే వందమంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన కొనసాగించేందుకు వెళ్లిన జోగి రమేష్, ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించారు.
Jogi Ramesh | జోగి రమేష్ ఆరోపణలు
VTPS నుంచి ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను అక్రమంగా డంప్ చేస్తూ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరియు ఆయన బావమరిది రోజుకి రూ. 25 లక్షల అక్రమార్జన చేస్తున్నారని జోగి ఆరోపించారు.ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే “లోకేష్ పెట్టమన్నాడు” అనే వాదన వినిపిస్తోందని, దీనిపై లోకేష్ స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు. బూడిద డంప్‌ల వల్ల ప్రజలు క్యాన్సర్, శ్వాస సంబంధిత వ్యాధుతో బాధపడుతున్నారని చెప్పారు.“నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా?” అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.నిన్ననే పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేసి, నిరసనకు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, ఉదయం వైసీపీ శ్రేణులు బూడిద డంప్(Ash Dump) వైపు కదలడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రగాఢ నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ భర్త గరికపాటి రాంబాబు, ఇతర స్థానిక నేతలు కూడా ప్రజా ఉద్యమానికి మద్దతు పలికారు. జోగి రమేష్ ఆరోపణలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(MLA Vasantha Krishna Prasad) తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. తాను బూడిద రవాణాలో ఏ అవకతవకలు చేయలేదని అన్నారు. జోగి రమేష్ పిలుపుతో బూడిద డంప్‌ల వద్ద బూడిద మాఫియా(Ash Mafia)ను అడ్డుకోవాలని ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది.అధికార పార్టీపై విపక్షాల నుంచి బూడిద కుంభకోణంపై దుమారం రేగుతోంది.ఈ ఘటన రాష్ట్రంలో పర్యావరణ భద్రత, ప్రజారోగ్యం అంశాలను మళ్లీ చర్చకు తెచ్చింది.“బూడిద డంపులను వెంటనే తొలగించాలి, బూడిద దొంగలను అరెస్ట్ చేయాలి. బూడిద వల్ల ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం మానాలి” అని డిమాండ్ చేశారు జోగి రమేష్.