More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

    Hydraa | హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా, డీఆర్​ఎఫ్ (DRF)​ సిబ్బంది హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించారు.

    నగరం (Hyderabad)లోని బుద్ధభవన్​లో గల హైడ్రా కార్యాలయం వద్దకు బుధవారం భారీ సంఖ్యలో హైడ్రా, డీఆర్​ఎఫ్​ సిబ్బంది చేరుకున్నారు. తమ జీతాలు (Salaries) తగ్గించారని వారు ఆందోళన నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించారు. విధులను బహిష్కరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.

    Hydraa | జీతాలు కట్​ చేస్తున్నారని..

    తమ జీతాలు కట్​ చేస్తున్నారంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు నుంచి విధులకు వెళ్లకుండా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. గతంలో జీహెచ్​ఎంసీ (GHMC)లో పని చేసిన 1,100 మంది సిబ్బంది ప్రస్తుతం ఔట్​ సోర్సింగ్​ విధానంలో హైడ్రాలో పని చేస్తున్నారు. తమతో రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయించుకుంటున్నారని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో ప్రకారం ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులకు అందిరికి ఒకేలా జీతాలు చెల్లించాలన్నారు. అయితే తమ జీతం మాత్రం రూ.5 వేలు కట్ చేసుకొని ఇస్తున్నారన్నారు. దాదాపు సగం మంది జీతాలు కట్​ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనంలో ఎందుకు కోత పెట్టారో తెలపాలని వారు డిమాండ్​ చేశారు. మొత్తం జీతం ఇచ్చే వరకు విధులకు వెళ్లకుండా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

    Hydraa | నిలిచిన సేవలు

    హైడ్రా, డీఆర్​ఎఫ్​ సిబ్బంది విధులు బహిష్కరించడంతో నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. కాగా ఇటీవల హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్ (Marshals)​ సైతం విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. వారు కూడా జీతాలు తగ్గించారనే నిరసన తెలిపారు. అయితే హైడ్రా కమిషనర్​ వారితో మాట్లాడి ఎవరి జీతాలు తగ్గవని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. డీఆర్​ఎఫ్​ సిబ్బందితో కూడా కమిషనర్​ చర్చించే అవకాశం ఉంది.

    More like this

    PM Modi | ఇది నయా భారత్.. అణుబెదిరింపులకూ భయపడబోమన్న ప్రధాని..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఇది సరికొత్త భారతదేశమని, అణుబాంబు బెదిరింపులకు భయపడబోదని ప్రధానమంత్రి నరేంద్ర...

    Taneira | పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

    అక్షరటుడే, హైదరాబాద్: Taneira | టాటా మహిళల ఎత్నిక్ వేర్ బ్రాండ్ అయిన తనైరా Tata women's ethnic...

    Teenmar Mallanna | తీన్మార్​ మల్లన్న కొత్త పార్టీ.. పేరు, గుర్తు ఇదే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Teenmar Mallanna | తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న...