More
    HomeతెలంగాణRajagopal Reddy | యువత తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి.. రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rajagopal Reddy | యువత తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి.. రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల (Jobs) భర్తీ విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

    రాజగోపాల్​ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన సీఎంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. ఆర్​ఆర్​ఆర్​ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆర్​ఆర్​ఆర్ (RRR)​ అలైన్​మెంట్​ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అన్నారు. ఆర్​ఆర్​ఆర్​ నిర్వాసితులకు కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

    Rajagopal Reddy | యువతకు అండగా ఉంటా..

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిందని రాజగోపాల్​రెడ్డి అన్నారు. దీంతో నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. మిగతా ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని యువత డిమాండ్​ చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు తనకు అండగా ఉంటానన్నారు. యువత ఆశయాల కోసం తాను వారితో ఉంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దన్నారు.

    Rajagopal Reddy | ప్రభుత్వాలు కూలిపోతాయి

    యువత అనుకుంటే ఏదైనా సాధ్యం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు సైతం కూలిపోతాయని హెచ్చరించారు. ఇటీవల నేపాల్ (Nepal)​లో అవినీతి ప్రభుత్వాన్ని దింపడానికి యువత చేసిన పోరాటాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని చెప్పారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొదన్నారు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్​రెడ్డి అన్నారు.

    More like this

    Banswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్​ను డీసీఎం ఢీకొనగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్​లోని (Nasrullabad) నిజాంసాగర్​...

    Vishwakarma Jayanti | ఘనంగా విశ్వకర్మ జయంతి

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Vishwakarma Jayanti | అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర జయంతిని...

    Asia Cup | కొన‌సాగుతున్న షేక్ హ్యాండ్ వివాదం.. అలా చేస్తే పాకిస్తాన్‌కి రూ.400 కోట్ల పైన న‌ష్టం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్‌ 2025లో భారత్ vs పాక్ మధ్య జరిగిన...