అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 126 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 37 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 82,490 నుంచి 82,720 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,272 నుంచి 25,342 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 280 పాయింట్ల లాభంతో 82,661 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 25,326 వద్ద ఉన్నాయి.
Stock Markets | దూకుడుమీదున్న పీఎస్‌యూ స్టాక్స్..
పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్(PSU bank index) 1.38 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ 0.83 శాతం, ఐటీ 0.70 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.64 శాతం, ఎనర్జీ 0.62 శాతం, ఆటో ఇండెక్స్ 0.44 శాతం లాభాలతో ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ 0.31 శాతం, టెలికాం 0.22 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 0.20 శృాతం నష్టాలతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
బీఈఎల్ 2.15 శాతం, ట్రెంట్ 1.20 శాతం, ఎస్‌బీఐ 1.03 శాతం, మారుతి 1.03 శాతం, కోటక్ బ్యాంక్ ఒక శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Markets | Top losers..
టైటాన్ 0.92 శాతం, పవర్‌గ్రిడ్ 0.59 శాతం, టాటా స్టీల్ 0.47 శాతం, ఐటీసీ 0.41 శాతం, అదాని పోర్ట్స్ 0.37 శాతం నష్టాలతో ఉన్నాయి.