More
    Homeక్రైంHyderabad | హైద‌రాబాద్‌లో దారుణం.. సంచిలో మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం

    Hyderabad | హైద‌రాబాద్‌లో దారుణం.. సంచిలో మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar police station) పరిధిలోని కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద మ‌హిళ మృత‌దేహం ల‌భ్య‌మైంది. నగ్నంగా ఉన్న యువతి మృతదేహంతో కూడిన సంచి ల‌భించ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. మూడు రోజుల క్రితం ఆమె హత్యకు గురైందని పోలీసులు (Police) అనుమానిస్తున్నారు.

    బాధితురాలి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శరీరంపై దుస్తులు లేకపోవడంతో, మహిళను చంపడానికి ముందు లైంగిక దాడికి పాల్ప‌డి ఉంటారని అనుమానిస్తున్నారు. స‌మాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు (Rajendranagar police) హుటాహుటిన రంగంలోకి దిగారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే, అనుమానితులను గుర్తించడానికి సమీపంలోని ప్రదేశాల నుంచి CCTV ఫుటేజ్‌లను ప్రత్యేక క్లూస్ బృందం విశ్లేషిస్తోంది. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలు ఎవ‌ర‌నేది ఇంకా గుర్తించ‌లేదు.

    ఆమె మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించిన పోలీసులు.. దర్యాప్తునకు (investigation) సహాయపడే ఏదైనా సమాచారం ఉంటే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని విజ్ఞప్తి చేశారు. మ‌రోవైపు, సీసీ టీవీ ఫుటేజీల్లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్లు తెలిసింది. మ‌హిళ‌ను హ‌త్య చేసిన నిందితుడు మృత‌దేహాన్ని సంచిలో కుక్కి, ఆటోలో ఇక్క‌డకు తీసుకుచ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. మృత‌దేహాన్ని బ్రిడ్జి కింద ప‌డేసిన నిందితుడు చాలా సేపు అక్క‌డే ఉన్న‌ట్లు తేలింది. ఆ త‌ర్వాత రైలు ఎక్కి అస్సాం పారిపోయిన‌ట్లు గుర్తించారు. అత‌డి కోసం ప్ర‌త్యేక బృందం గాలిస్తోంది.

    More like this

    Jubilee Hills | జూబ్లీహిల్స్‌ టికెట్​కు పెరుగుతున్న పోటీ.. తనకే టికెట్​ ఇవ్వాలంటున్న అంజన్‌కుమార్ యాదవ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | అధికార కాంగ్రెస్​ పార్టీ(Congress Party)లో జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం పోటీ...

    Nizamabad City | పోలీసు శాఖ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్​శాఖకు రావాల్సిన పెండింగ్​ బిల్లులను వెంటనే...

    Clear Tax | క్లియర్‌టాక్స్ ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు

    అక్షరటుడే, హైదరాబాద్ : Clear Tax | దేశంలో పన్నుల దాఖలుకు సంబంధించిన ప్రముఖ వేదికైన క్లియర్‌టాక్స్, తమ...