More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం (Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. చెదురుమొదురు వానలు పడుతాయని పేర్కొన్నారు.

    వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భారీ వర్షాలు లేవని అధికారులు చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెదురు మొదురు వానలు (Scattered RAins) మాత్రమే పడుతాయని అధికారులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్​, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్​, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురుస్తాయి.

    Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్​ (Hyderabad)లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్​ ఉంది. అయితే భారీ వర్షాలు పడవని అధికారులు పేర్కొన్నారు.

    Weather Updates | పంటలకు నష్టం

    వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆగస్టులో కురిసిన వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. నిరంతరం వర్షాలు పడుతుండటంతో పలు ప్రాంతాల్లో వరి పొలాలు పాడవుతున్నాయి. గింజలు తాలుగా మారుతున్నాయని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. వరద ధాటికి ఇటీవల వేసిన తాత్కాలిక రోడ్లు పలు చోట్ల కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    More like this

    Clear Tax | క్లియర్‌టాక్స్ ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు

    అక్షరటుడే, హైదరాబాద్ : Clear Tax | దేశంలో పన్నుల దాఖలుకు సంబంధించిన ప్రముఖ వేదికైన క్లియర్‌టాక్స్, తమ...

    Makloor | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఇద్దరి దుర్మరణం

    అక్షరటుడే, ఆర్మూర్​: Makloor | మాక్లూర్​ మండలంలోని దుర్గానగర్​ తండా (Durga nagar Thanda)​ వద్ద ఘోర రోడ్డు...

    RBI Recruitment | డిగ్రీతో ఆర్‌బీఐలో కొలువులు.. ఎంపికైతే లక్షన్నర వరకు వేతనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Recruitment | ప్రభుత్వ ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI)...