More
    HomeతెలంగాణSriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 37 గేట్లు ఎత్తివేత

    Sriram Sagar | ఎస్సారెస్పీకి భారీగా వరద.. 37 గేట్లు ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, మెండోరా : Sriram Sagar |ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​కు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    రాష్ట్రంలో, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి (Godavari)కి భారీగా వరద వస్తోంది. దీంతో ఎస్సారెస్పీలోకి 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. మంగళవారం 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. బుధవారం మరింత పెరిగింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను భారీగా పెంచారు. 37 గేట్లు ఎత్తి 2,58,705 క్యూసెక్కులు వదులుతున్నారు.

    Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల

    ప్రాజెక్ట్​ ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిడ్​ మానేరు (Mid Manair), లోయర్​ మానేరు డ్యాం (LMD)లు నిండటంతో వరద కాలువ ద్వారా నీటి విడుదలను తగ్గించారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతోంది.

    Sriram Sagar | క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం

    శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. ఇన్​ఫ్లో కంటే ఔట్​ఫ్లో అధికంగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2,75,372 క్యూసెక్కుల ఔట్​ఫ్లో ఉంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1088.1 (70.14 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    More like this

    Mirai Movie | 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిరాయ్.. కేవ‌లం ఐదు రోజుల్లోనే అరుదైన ఫీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirai Movie | యంగ్ హీరో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో ఫాంటసీ...

    Jogi Ramesh | బూడిద మాఫియా వ్యతిరేకంగా ఆందోళన.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్, ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jogi Ramesh | బూడిద మాఫియాను ఎదుర్కొంటూ బుధవారం ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ నేత,...

    Bodhan Sub-Collector | ఓటర్​ డాటా మ్యాపింగ్​పై శిక్షణ ఇవ్వాలి

    అక్షరటుడే, బోధన్​: Bodhan Sub-Collector | బీఎల్​వోలకు(BLO) ఓటర్ల డాటా మ్యాపింగ్​పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సబ్​ కలెక్టర్​...