More
    Homeక్రీడలుAsia Cup 2025 | ఆసియా కప్ 2025: ఆఫ్ఘనిస్తాన్​పై థ్రిల్లింగ్ విజయంతో బంగ్లాదేశ్ సూపర్-4...

    Asia Cup 2025 | ఆసియా కప్ 2025: ఆఫ్ఘనిస్తాన్​పై థ్రిల్లింగ్ విజయంతో బంగ్లాదేశ్ సూపర్-4 ఆశలు సజీవం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup 2025 | తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ Bangladesh అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం జరిగిన డూ-ఆర్-డై పోరులో ఆఫ్ఘనిస్తాన్​ను afghanistan 8 పరుగుల తేడాతో ఓడించి సూపర్-4 అవకాశాలను నిలబెట్టుకుంది.

    చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/28) హిరోగా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

    ఓపెనర్ తంజిద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సైఫ్ హసన్ (30), టౌహిడ్ హృదయ్ (26) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అఫ్ఘాన్​ బౌలర్లలో రషీద్ ఖాన్ (2/26), నూర్ అహ్మద్ (2/23) రెండేసి వికెట్లు తీయగా, ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

    Asia Cup 2025 | ఆఫ్ఘనిస్తాన్ ఛేదనలో విఫలం

    154 లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. రెహ్మనుల్లా గుర్బాజ్ (35), ఒమర్జాయ్ (30), రషీద్ ఖాన్ (20) మాత్రమే రాణించగా, మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.

    బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/28) కీలక వికెట్లు తీశాడు. నాసుమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

    చివరి రెండు ఓవర్లలో అఫ్గాన్ విజయానికి 27 పరుగులు అవసరం. క్రీజులో రషీద్ ఖాన్ ఉండటంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందని అనుకున్నారు.

    ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని బౌండరీగా మలిచిన రషీద్ Rasheed Khan, వెంటనే ఔటవ్వడం అఫ్గాన్ కుప్పకూలేలా చేసింది.

    అదే ఓవర్‌లో మరో వికెట్ తీసిన ముస్తాఫిజుర్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 22 పరుగులు అవసరమైనా, నూర్ అహ్మద్ రెండు సిక్స్‌లు బాది ఔటవడంతో అఫ్ఘాన్ ఆశలు చెదిరిపోయాయి.

    ఈ విజయంతో గ్రూప్-బీ పాయింట్ల పట్టిక ఉత్కంఠభరితంగా మారింది. రెండు విజయాలతో శ్రీలంక టాప్‌లో ఉండగా, రెండు గెలిచి ఒకటి ఓడిన బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. ఒకటి గెలిచి, రెండు ఓడిన ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది.

    హాంగ్ కాంగ్ Hong Kong ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అఫ్గాన్ జట్టుకు శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్ కీలకం. మెరుగైన రన్‌రేట్‌తో Run Rate గెలిస్తే సూపర్-4లో అడుగుపెడుతుంది.. లేకుంటే టోర్నీ tournament నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

    More like this

    Telangana DGP | కొత్త డీజీపీ ఎవ‌రో? రెడ్డివైపే ప్ర‌భుత్వం మొగ్గు?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ప్ర‌స్తుత డీజీపీ...

    Group -1 Exams | గ్రూప్​–1 అంశంపై డివిజన్​ బెంచ్​లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group -1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై ఇటీవల హైకోర్టు (High Court) సింగిల్​...

    MLA Dhanpal | తెలంగాణ యోధుల పోరాటపటిమను భావితరాలకు తెలపాలి

    అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుల పటిమ భావితరాలకు తెలియజేయాలని అర్బన్...