అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి మరో మెయిన్‌బోర్డ్ (Main board) ఐపీవో వస్తోంది. వీఎంఎస్ టీఎంటీ కంపెనీ ఐపీవో (IPO) సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభం అవుతుంది. చిన్న కంపెనీ కావడం, జీఎంపీ బాగుండడంతో ఐపీవోకు విశేష స్పందన లభించే అవకాశాలున్నాయి.
వీఎంఎస్ టీఎంటీ (VMS TMT) కంపెనీని 2013లో ఏర్పాటు చేశారు. ఇది థెర్మో మెకానికల్లి ట్రీటెడ్ బార్స్ (TMT) తయారు చేస్తుంది. దేశవ్యాప్తంగా 3 డిస్ట్రిబ్యూటర్స్, 227 మంది డీలర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 148.50 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ (Fresh issue) కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.50 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇప్పటికే తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
IPO | ప్రైస్ బాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని (Price band) రూ. 94 నుంచి రూ. 99 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 150 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద రూ. 14,850 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (IPO Subscription) బుధవారం ప్రారంభం అవుతుంది. శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 22న రాత్రి వెల్లడవనుంది. కంపెనీ షేర్లు ఈనెల 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీ (QIB)లకు 30 శాతం, ఎన్ఐఐలకు 20 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 50 శాతం వాటాను కేటాయించింది. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ రూ. 24 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 24 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.