అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఎన్నికలు (Non-Gazetted elections) మంగళవారం టీఎన్జీవోస్ కార్యాలయంలో (TNGOs office) నిర్వహించారు. తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
జిల్లా అధ్యక్షుడిగా నర్సింలు, అసోసియేట్ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి, అబ్దుల్ అలీం, సాయినాథ్, కార్యదర్శిగా సయ్యద్ మసియోద్దీన్, జాయింట్ సెక్రెటరీలుగా రాధిక, విశ్వనాథ్, కోశాధికారిగా సృజన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా సురేష్, పబ్లిసిటీ సెక్రెటరీగా విష్ణు, ఈసీ మెంబర్లుగా మమత, విజయలక్ష్మి, రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ మహిళా కార్యదర్శి రాజకుమారి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.